Tuesday 9 October 2007

అణు ఒప్పందము

మన భారత దేశము సర్వసత్తాక స్వతంత్ర దేశము...ఎవరికీ లొంగదు..పూర్తి ప్రజాసామ్యము పరిఢవిల్లుతున్నది..(అవినీతి లో తిరుగులేకున్నా)..ఇదంతా నిజమేనా అనిపిస్తుంది ఇప్పుడు అణుఒప్పందము "విష"యంలొ..ఎందుకంటే మన అమ్ముడు పొయిన నేతలు మన జాతిని తాకట్టు పెట్టడానికి ఏమైన చేస్తారు అని ఇక్కడ ఋజువు అవుతున్నది.నిజంగా ఈ ఒప్పందము వల్ల లాభాల కంటె నష్టాలే ఎక్కువ.క్రింద ఇచ్చిన లింక్(తెలుగు లొ..?) పరిశీలించండి.
1. http://www.ieer.org/latest/indiairan.html

పరస్పర నమ్మకము లేకుండా ఉభయ దేశాలు చేస్కుంటున్న ఈ ఒప్పందము ఎవరికి లాభమో అందరికి తెలుసు,మన దేశాన్ని తన చెప్పుచేతల్లొ పెట్టుకొవలను అనే దురాశ గల ఆ ధూర్త దేశం నుంది మనల్ని ఆ సేతు నిర్మించిన రాముడే కాపాడు గాక..

Wednesday 19 September 2007

రామ సేతు వివాదము

రామసేతు వివాదము ఇంకా చల్లారక ముందే నీచ కరుణానిధి దానికి ఆజ్యం పొశాడు కదా, ఇప్పుడు అది మన భా.జ.పా కి అద్బుతం గా పునరుజ్జీవనము కల్గించింది...ఇక చూస్కొ..వారి వీరంగము మొదలు..
స్సులు కాల్చడము..సజీవ దహనాలు..ఛ
కరుణానిధి నాస్తికుడు అని తెలిసిన విషయమే కాని ప్రజల యొక్క భక్తి భావములతొ ఆడుకోవడము ఖండించాల్సిన విషయము..ఇనా వాడు ఎవడు రాముడు Engineer graduate ఎక్కడి నుంది అని ప్రశ్నించడానికి? అస్సలు తప్పు మన వద్దే ఉంది..ఇదే మన దేశం లో ఎవరైనా మిగతా అన్య మతాలకి చేస్తే వారు వూర్కుంటారా? అస్సలు మన కుళ్లు రాజకీయ నాయకులు వూర్కుంటారా?
ఇదీ మన దేశం..

Tuesday 18 September 2007

నా మొదటి టపా

నిజం గా తెలుగు లొ టైప్ చెయడం అద్బుతం గా ఉంది,అందుకే కాబోలు తీయని తెలుగు -తేనులూరు తెలుగు అంటారు, ఇది నా మొదటి తెలుగు టపా..ఇవాల్టికి ఇక చాలు..ధన్యవాదములు.