Showing posts with label kavita. Show all posts
Showing posts with label kavita. Show all posts

Friday, 2 January 2009

కొత్త సంవత్సరము..కొత్త ఆశలు

హ..హు..అప్పుడే ఇంకొ సంవత్సరము వచ్చిందా..అని నాకు సందేహం వచ్చింది..


వెనక్కి తిరిగి చూస్కున్నా..
ఏమైనా నా అడుగు జాడలు కనిపిస్తాయేమోనని..
ఏమైనా సాధించానేమోనని..
ఏమైనా తీపి తీపి గురుతులున్నాయెమోనని...
కనీసం చేదు ఙ్నాపకాలైన..
మదిని కలవర పెడుతాయెమోనని..
చాల సేపు మధించా...
కాని ఎమీ లెవు..
బాగా ఆలొచించా..ఎమైందీ అని..
చాల గంటల తర్వాత తెలిసింది..
పొయిన సంవత్సరం..పొయ్యింది..కాని..నేను మాత్రం అలాగె వున్న..
పాత ఙ్నాపకాలకి. పాతర వెయ్యలనుకున్నానని..
అవి వెలుగు లొ సైతం కనరావని..
అవి అతి లొతుల్లొకి వెళ్ళి పొయాయని..
అందుకె..నేను వాటి గూర్చి.. ఆలొచించడం మానేసా..
నూతన జీవితం వైపు అడుగులు వేస్తున్నా..